తెలంగాణ

ఎల్బీనగర్ వాసులకు రెడ్ అలెర్ట్.. చికెన్ తింటే మటాష్!

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం కొనసాగుతోంది. మార్చి రెండో వారంలో బర్జ్ ఫ్లూతో లక్షలాది కోళ్లు చనిపోయాయి. తర్వాత కొంత తగ్గింది. చికెన్ తినడం మాములుగా మారిపోయింది. బర్జ్ ఫ్లూ భయం పోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ కలకలం రేగింది. హైదరాబాద్ శివారులో మరోసారి బర్డ్‌ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వేల కొద్ది కోళ్లు మృత్యువాత పడ్డాయి. నాలుగు రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను అధికారులు సేకరించి బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. కోట్లలో ఆస్థి నష్టం జరుగుతుందని లబోదిబోమంటున్నారు. మరోసారి శాంపుల్స్‌ను అధికారులు సేకరించారు. కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పౌల్ట్రీ యజమానులకు అధికారులు స్పష్టం చేశారు

Back to top button