క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా బర్డ్ ఫ్లూ కేసు నమోదయింది. ఇప్పటివరకు ఈ వ్యాధి అనేది కేవలం కోళ్లలో మాత్రమే గుర్తించగా ప్రస్తుతం మనుషులకు సోకుతుంది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పది లక్షలకు పైగా కోళ్లు ఈ వ్యాధి కారణంగా మృతి చెందాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చికెన్ తినడానికి గజగజ వనికి పోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధిపై ఆరా తీస్తుంది. రాజగా ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలంలోని ఒక కోళ్ల ఫారం దగ్గర ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు తెలిపారు. అతనికి పాజిటివ్ రావడంతో వెంటనే చికిత్స అందిస్తున్నామని ఉన్నారు. అంతేకాకుండా ఈ ఉంగటూరు మండలం సమీపంలో కొన్ని మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తప్పతాగి పడుకున్న వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ మాయదారి బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా కోళ్లు చనిపోయాయి. దీంతో చికెన్ తినడానికి ఎవరు కూడా ముందుకి రావడం లేదు. కాబట్టి ఒక్కసారిగా చికెన్ ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. చాలామంది ఈ వ్యాధి తెలిసినప్పటి నుంచి సరిగ్గా చికెన్ విక్రియాలనేవి ఆపేశారు. కానీ మనిషిలో ఈ వ్యాధి సోకడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన కోళ్లు అన్నిటిని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి పూడ్చి పెట్టేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ వ్యాధిపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నిరంతరం భయం కలుగుతుంది.