ఈ సంవత్సరం ఘనంగా ప్రారంభించిన బిగ్ బాస్ సీజన్ 8 చివరి రోజున విన్నర్ ఎవరో తేలింది. బిగ్ బాస్ హౌస్ లోకి హాట్ ఫేవరెట్ గా వచ్చినటువంటి నిఖిలే ఈ సీజన్ విన్నర్ అయ్యాడు. గత సంవత్సరం పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్న విషయం మన అందరికి తెలిసిందే. కాగా గత సంవత్సరం ఫైనల్స్ లో అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరగడంతో ఈసారి అలా జరగకుండా ముందుగానే భారీగా ఏర్పాటు చేశారు.
మెగాస్టార్ ఇంటికి ఐకాన్ స్టార్… కారణమేంటి?
ఇక ఈసారి గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రైజ్ మనీ పెంచేశారు బిగ్ బాస్. విన్నర్ అయినా నిఖిల్ కు ఏకంగా 55 లక్షలు అందజేశారు. ఈ మేరకు తెలుగు బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున సమాచారం అందజేశారు. అలాగే 55 లక్షల రూపాయలతో పాటు మారుతి సుజుకి డిజైర్ కార్ ను కూడా నిఖిల్ గెలుచుకున్నాడు.
అల్లు అర్జున్ ను బయటకు తీసుకు వచ్చిన లాయర్ కు ఇన్ని లక్షలా?
ఈ సీజన్ ఫైనలిస్టులుగా టాప్ ఫైవ్ లో గౌతమ్, అవినాష్, ప్రేరణ, నబీల్ మరియు నిఖిల్ నిలవగా… అవినాష్, ప్రేరణ, నబీల్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ కాగా చివరికి గౌతమ్ మరియు నిఖిల్ మధ్య విపరీతమైన పోటీ జరగగా నిఖిల్ ను విన్నర్ గా ప్రకటించారు రామ్ చరణ్. ఇక మొత్తంగా నిఖిల్ 88 లక్షలు బిగ్ బాస్ హౌస్ నుండి సంపాదించాడు. ప్రైజ్ మనీ గా 55 లక్షలు ఒక మారుతి డిజైర్ కారు అలాగే హౌస్ లో 14 వారాలు ఉన్నందుకు గాను 88 లక్షలు వెనకేసుకున్నాడు.