![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-6.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- విజయవాడ మాజీ ఎంపీ కేశినేని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ కు గురవుతున్నారు. అయితే గతంలో కేశినేని నాని టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసి కేశినేని శివనాథ్ చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ ఓటమి చవిచూసిన కేశినేని నాని ఓటమిని జీర్ణించుకోలేక ఇకపై రాజకీయాలకు గుడ్ బాయ్ చెబుతున్నాను అంటూ జూన్ 10వ తారీఖున 2024లో ప్రకటించారు.
సాహితీ మేఖల ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలు
ఇది తన మాటలకు విరుద్ధంగా తాజాగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నేతలను కలుస్తూ మళ్లీ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. దీంతో తాజాగా ఆయన మాట్లాడిన వివిధ సభల్లోని వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాజకీయాలను వదిలేయాలనుకుంటున్న కేజీనేని నాని మళ్లీ ఇలా రాజకీయాల్లో పాల్గొనడం ఏంటి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసినేని నాని గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ విషయాలతో నాని సోషల్ మీడియాలో అప్పటివి, ఇప్పటివి పోస్ట్ చేస్తూ ఉండడంతో చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్…