![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/IMG-20250215-WA00181-780x470.jpg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, జగిత్యాల :- జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం, దమ్మన్నపేట గ్రామంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. మాటు వేసిన దుండగులు తాళం బద్దలుకొట్టి చోరీ చేశారు. ఇక ఇంటి కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో బీరువా తెరిచి ఉంది. బట్టలు, వస్తువులు చల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. ఇక వెంటనే దొంగతనం జరిగిందని ఇంటి యజమాని గంగారెడ్డి నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించారు.
ఇంట్లో ఉన్న 15 జిల్లాల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులకు వివరణ ఇచ్చాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు విచారణ జరిపిదర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
1. మహా కుంభమేళాలో రౌడీ బాయ్!.. విజయ్ లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్?
2.మహా కుంభమేళాలో రౌడీ బాయ్!.. విజయ్ లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్?