
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ లేనట్లేనని సంచలన ప్రకటన చేయడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ప్రతి ఒక్కరు షాకు కు గురయ్యారు. తాజాగా ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మంత్రివర్గ విస్తరణ అనేది తీసివేయాలో లేక ఉంచాలనేది హైకమాండ్ ది నిర్ణయం అని కరాకండిగా తెలిపారు. ఇక ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని అన్నారు. నాకు ఉన్న అవకాశం మేరకు రాష్ట్రంలోని ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పని చేస్తానని తెలిపారు. కుల గణన ఆశామాసిగా చేయలేదని చాలా పకడ్బందీగా చేసామని అన్నారు. నాకు, రాహుల్ గాంధీకి మధ్య ఎటువంటి మనస్పార్ధాలు లేవని స్పష్టం చేశారు. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు.
భూసర్వే అధికారులను అడ్డుకున్న గిరిజన మహిళలు…! భారీగా మోహరించిన పోలీసులు…?
కాగా గతంలో రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 11 మందిని తన మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. అదే సమయంలో నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చోటు దక్కని విషయం అందరికీ తెలిసింది. కాబట్టి ఆ సమయంలో రేవంత్ రెడ్డి త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే నిరుత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. కాగా ఈ ప్రకటనతో మంత్రివర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్న వారు ఎలా రియాక్ట్ అవుతారనేది తెలంగాణ రాష్ట్రం రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం!… 10వ స్థానంలో పవన్ కళ్యాణ్?