ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇవాళ వైసీపీ మాజీ మంత్రి రాజీనామా చేయడం మరింత షాకు కు గురి చేసింది. వైసిపి నిర్ణయాలు నచ్చక ఇవాళ మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు.
మళ్లీ గొడవ జరిగితే లోపలేస్తా.. మంచు సోదరులకు సీపీ వార్నింగ్
వైసీపీ ప్రభుత్వంలో నేతలకి అలాగే కార్యకర్తలకు ఎటువంటి గౌరవం లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. వైసిపి లో ఏకపక్ష నిర్ణయాలే ఎక్కువగా ఉన్నాయని, ఎవరి దగ్గర నుండి ఎటువంటి అభిప్రాయాలు మరియు సలహాలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు కూడా కాలేదు , కానీ అప్పుడే ధర్నాలు చేయడమేంటని జగన్ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు.
మనిషి కూర్చుని నడపగలిగే డ్రోన్ తయారుచేసిన ఇంటర్ విద్యార్థి?
ఇక చిన్న చిన్న విషయాలను కూడా వైసిపి పార్టీ రాజకీయాలు చేస్తోందని వైసిపి పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వచ్చే జమిలి ఎన్నికల్లో పార్టీ బాగా లబ్ధి పొందేందుకే ఇటువంటి ధర్నాలు మరియు నిరసనలు చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ చెప్పడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన అనంతరం మీడియా వేదిక ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు.