
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- సినిమా పైరసీ విషయంలో అరెస్ట్ అయిన ఇబొమ్మ రవి కి మరొక షాకింగ్ న్యూస్ తగిలింది. ఇప్పటికే ఐ బొమ్మ రవి జైల్లో ఉన్నప్పటికీ తాజాగా నాంపల్లి కోర్టు మరో 14 రోజులు పాటు జ్యుడీషియల్ రిమాండ్ అనేది విధించింది. దీంతో ఐ బొమ్మ రవి డిసెంబర్ 15వ తేదీ వరకు కూడా జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే తాజాగా ఐ బొమ్మ రవి పై పోలీసులు మరో మూడు కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో తండెల్ మూవీ పైరసీ పట్ల మంచు విష్ణు అలాగే దిల్ రాజ్ వంటి వారు కంప్లీట్ చేయగా పోలీసులు కొత్తగా రవి పై మూడు కేసులు నమోదు చేశారు. ఇక ఇప్పటికే జైల్లో ఉన్న రవి ఈ కేసులతో మరికొద్ది రోజులు పాటు జైల్లోనే ఉండనున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ప్రభుత్వ తరపు లాయర్ మాత్రం ఐ బొమ్మ రవికి బెయిల్ మంజూరు చేయొద్దు అని.. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే అతను విదేశాలకు వెళ్లిపోయి ఆధారాలన్నింటినీ కూడా తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని వాదించారు. దీంతో రవి బెయిల్ పిటిషన్ విచారణ అనేది రేపటికి వాయిదా వేశారు. దీంతో అసలు ఈ ఐ బొమ్మ రవి కేసు విషయం చివరికి ఎలాంటి మలుపుకు దారితీస్తుందా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఐ బొమ్మ రవి పై సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా ఆగ్రహంగా ఉంది. ఇంకోవైపు చాలామంది సినిమా ప్రేక్షకులు మాత్రం ఐ బొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.
Read also : బ్రేకింగ్ న్యూస్.. ఐపీఎల్ కు మూడో విధ్వంసకర ప్లేయర్ రిటైర్మెంట్!
Read also : ఇంటికి వెళ్తాం.. మమ్మీ ని చూడాలని ఉంది అంటూ 2,3 ఏళ్ల పిల్లలు రిక్వెస్ట్!





