
క్రైమ్ మిర్రర్, న్యూస్:- టాలీవుడ్ ప్రముఖ హీరో, ప్రిన్స్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా మహేష్ బాబుకు ఈడి నోటీసులు పంపించింది. తెలంగాణలో ఒక వ్యక్తి తమ వెంచర్కు అన్ని అనుమతులు ఉన్నాయని.. అలాగే మరో వ్యక్తి మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి బాలాపూర్ లో 34.80 లక్షల పెట్టి స్థలం కొన్నామని ఇద్దరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ లేఅవుట్ లేకపోవడంతో డబ్బు ఇవ్వమంటే సంస్థ 15 లక్షల మాత్రమే ఇచ్చిందని బాధితులు తెలిపారు. ఎంతో సాయి సూర్య డెవలపర్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ సాయి సూర్య డెవలపర్ సంస్థను మొదటి ప్రతివాదిగా యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తాను, రెండవ ప్రతివాదిగా, ప్రచారకర్త మహేష్ బాబును మూడవ ప్రతివాదిగా చేర్చింది. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ వెంచర్ ప్రత్యేకతలకు చాలామంది ఆకర్షితులై డబ్బు చెల్లించి కోల్పోయినట్లుగా ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు, ఇండ్లకు మంజూరు…ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ
తల్లిపై కోపంతో చిన్నారిని నరికి చంపిన పిన్ని.. కోరుట్లలో దారుణం