
మద్దూర్, నారాయణపేట (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి):- ఆర్టీసీ బస్సు బోల్తా పడి దాదాపు 15 మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ గ్రామ శివారులో జరిగింది. పరిగి ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పరిగి నుంచి షాద్నగర్కు ప్రయాణికులను తీసుకొని వెళుతున్నది. ఆర్టీసీ బస్సులో 56 మంది ప్రయాణికులు ప్రయాణం చేయవలసి ఉంటుంది కానీ 94 మంది ప్రయాణికులకు ఆర్టీసీ కండక్టర్ అప్పటికే టికెట్ ఇచ్చేశాడు. మెల్లగా వెళుతున్న ఆర్టీసీ బస్సు మల్కాపూర్ గ్రామ శివారులోకి రాగానే మెల్ల మెల్లగా పక్కకు వరిగి పడిపోయింది. 94 మంది ప్రయాణికులు ఉండగా 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినాయి. విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ సంఘటన స్థలాన్ని చేరుకొని గాయాలు తగిలిన క్షతగాత్రులను ప్రభుత్వ అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ఉన్న ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు పంపే విధంగా పరిగి ఎస్సై ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు పంపించారు. బస్సు ఎలా పక్కకు వరిగి పడిపోయింది అని దానిపై విచారణ జరుగుతున్నారు పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడిన పరిగె ఆర్డిసి డిఎం సంఘటన స్థలానికి రాకపోవడం గమనార్హం.
మజీదుల దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు బృందం
టీడీపీలో యనమల భవిష్యత్ ఏంటి..?- రాజ్యసభ స్థానమా, రాజకీయ సన్యాసమా..?