
-
రేవంత్‌పై బీజేపీ నేత వేసిన కేసును కొట్టేసిన హైకోర్టు
-
రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పిటిషన్
-
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కాసం వెంకటేశ్వర్లు పిటిషన్
-
హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సీఎం రేవంత్ రెడ్డి
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. బీజేపీ నేత వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 2024 మేలో కొత్తగూడెంలో జరిగిన సభలో బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, రిజర్వేషన్లను బీజేపీ తొలగిస్తుందని రేవంత్ అన్నారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ వ్యాఖ్యలతో బీజేపీ పరువుకు భంగం వాటిల్లిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై రేవంత్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీంతో బీజేపీ నాయకుడి పిటిషన్‌ను కొట్టేస్తూ ఉన్నతన్యాయస్థానం తీర్పునిచ్చింది.
Read Also: