
ఆచూకీ లేని సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్..
వారంలో ఒకటి రెండు రోజులే హాజరు..
ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు..
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- మర్రిగూడ మండలంలో సెంట్రల్ బ్యాంక్ సేవలు, ప్రజలకు దొరికేవి అంతంత మాత్రమనే చెప్పుకోవాలి. గంట కొట్టి బందు పెట్టే ఈ బ్యాంక్ లల్లో అన్నీ అవాంతరాలే. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్న ప్రజలు, లోన్ ల కోసం బ్యాంక్ ల చుట్టు ప్రదక్షిణాలు చెయ్యడం ఆనవాయితీగా మారింది. ప్రభుత్వం నుండి వచ్చే లోన్ ల కోసం కొంతమంది, గోల్డ్ లోన్ కోసం మరి కొంతమంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సమయాలలో డబ్బులు అవసరమైన ఖాతాదారులు, సెంట్రల్ బ్యాంక్ కు బంగారం తీసుకొని వెళ్లి, మొఖం మార్చుకొని వెనుతిరిగి రావలసిన పరిస్థితి కనపడుతుంది. బ్యాంక్ సిబ్బంది అందరూ ఉన్నప్పటికీ, గోల్డ్ అప్రైజర్ లేకపోవడం గమనార్హం. వారానికి ఒకటి లేదా రెండు రోజులు హాజరు పలికే, ఆయనపై అనేక విమర్శలు విన్నపడుతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యమా లేక పరిస్థితులు అలా ఉన్నాయా అనేది అర్ధం కాని పరిస్థితి.. ఎంతోమంది గోల్డ్ లోన్ కోసం, సెంట్రల్ బ్యాంక్ కి వచ్చి వెనుతిరిగి వెళ్తున్నారు. గోల్డ్ అప్రైజర్ లేక ప్రజలు, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ కారణంతో లోన్ ల టార్గెట్ ను పూర్తి చెయ్యలేకపోతున్నారు బ్యాంక్ సిబ్బంది. బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నదని ప్రజలు భావిస్తున్నారు. బ్యాంక్ లో ఖాతాధారులకు, సిబ్బంది కనీస మర్యాద ఇవ్వడం లేదని అనేక ఆరోపణలు వినపడుతున్నాయి..
మరింత పూర్తి సమాచారంతో క్రైమ్ మిర్రర్ కధనం ద్వారా మీ ముందుకు…





