ఆంధ్ర ప్రదేశ్

BIG NEWS: రైతులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.15,000 జమ

BIG NEWS: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మిల్లెట్స్‌కు విపరీతమైన ప్రాధాన్యత పెరుగుతోంది.

BIG NEWS: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మిల్లెట్స్‌కు విపరీతమైన ప్రాధాన్యత పెరుగుతోంది. చిరుధాన్యాలు, సిరిధాన్యాలుగా పిలిచే ఈ ఆహార పంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే అవగాహన పెరగడంతో ప్రజలు విస్తృతంగా మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ టూ డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తుండటంతో, చాలామంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిల్లెట్స్ వినియోగం గణనీయంగా పెరిగింది.

మిల్లెట్స్‌కు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో ఇవి తినిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. అందువల్ల టైప్ టూ డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం కూడా వరి సాగును క్రమంగా తగ్గించి, మిల్లెట్స్ సాగును ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. రైతులు మిల్లెట్స్ సాగు చేపట్టేందుకు ప్రోత్సాహకంగా ఎకరాకు రూ.5,000 నుంచి రూ.15,000 వరకు ఆర్థిక సాయం అందిస్తోంది.

ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మిల్లెట్ మిషన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఈ మిషన్ అమలులో ఉంది. తెలంగాణలో కూడా త్వరలోనే ఈ మిషన్ అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, అండు కొర్రలు, సజ్జలు, క్వినోవా, మొక్కజొన్న, వరిగలు వంటి పలు రకాల మిల్లెట్స్ సాగును కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రోత్సహిస్తోంది.

మిల్లెట్ మిషన్‌లో భాగంగా సాగు చేపట్టే రైతులకు సబ్సిడీలు, వ్యవసాయ యంత్రాలు, శిక్షణ కార్యక్రమాలు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన వంటి అన్ని రకాల సహాయాన్ని కేంద్రం అందిస్తోంది. ముఖ్యంగా నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాలకు మిల్లెట్స్ ఎంతో అనుకూలమైన పంటలు కావడంతో ఎండ ప్రాంతాల్లో ఈ సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతమైన చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మిల్లెట్ మిషన్ అమలవుతోంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో మిల్లెట్స్ సాగు జరుగుతోంది. దీన్ని వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేసి 10 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా రైతులు ఎకరాకు రూ.15,000 వరకు వివిధ రూపాల్లో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, న్యూట్రీ సిరియల్ సబ్ మిషన్ ద్వారా మిల్లెట్స్ సాగుకు మరింత ఊతమిస్తోంది. ఈ పథకాల ద్వారా రైతులకు హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తి, పంపిణీపై సబ్సిడీలు, ఉచిత సీడ్ మినీ కిట్లు, పంట ప్రదర్శనలు, సమగ్ర పోషక నిర్వహణ, కీటక నియంత్రణ పద్ధతులపై సహాయం అందుతోంది. అంతేకాకుండా నీటిని ఆదా చేసే పరికరాలపై కూడా సబ్సిడీ కల్పిస్తోంది.

జొన్న, సజ్జ, రాగి వంటి మిల్లెట్స్‌కు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను కూడా ప్రకటిస్తోంది. పీఎం ఆశా పథకం ద్వారా ఈ పంటల కొనుగోళ్లకు హామీ ఇస్తోంది. సబ్సిడీల వివరాలను పరిశీలిస్తే.. ఒక హెక్టారుకు విత్తనాలపై 50 శాతం సబ్సిడీ, మైక్రో న్యూట్రియెంట్స్ లేదా లైమ్ కోసం హెక్టారుకు రూ.500, కీటక నియంత్రణ చర్యలకు హెక్టారుకు రూ.500, వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై 50 శాతం వరకు సబ్సిడీ లభిస్తోంది. ఈ విధంగా సగటున ఎకరాకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు సబ్సిడీ రూపంలో రైతులు పొందవచ్చు.

అదే విధంగా ఉచిత మినీ కిట్ల ద్వారా కొత్త రకం విత్తనాలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. వీటి విలువ ఎకరాకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉంటుంది. మద్దతు ధరలను గమనిస్తే.. జొన్న హైబ్రిడ్ రకానికి క్వింటాలుకు రూ.3,371, సజ్జలకు రూ.2,625, రాగులకు రూ.4,290 చొప్పున ప్రభుత్వం ధరను నిర్ణయించింది. మార్కెట్ ధర కంటే ఎక్కువగా విక్రయిస్తే రైతులు ఎకరాకు రూ.10,000కు పైగా అదనపు లాభం పొందే అవకాశం ఉంది.

మొత్తంగా మిల్లెట్స్ సాగు ద్వారా రైతులు ప్రతి ఎకరాకు సగటున రూ.5,000 నుంచి రూ.15,000 వరకు నగదు లాభం పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఇన్‌పుట్స్ ఖర్చు తగ్గడం, మద్దతు ధరల ప్రయోజనం, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలు కలిసి లాభాలను పెంచుతున్నాయి. మిల్లెట్స్‌లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి పోషకాలు అధికంగా ఉండటంతో ఇవి పోషకాహార భద్రతకు ఎంతో ఉపయోగపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అందుకే కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా మిల్లెట్స్ సాగును మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: Crime: భవనంపై నుంచి కూతురిని తోసేసిన తల్లి.. బాలిక మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button