
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్:-ఛత్తీస్‌గఢ్ అడవుల్లో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నదీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. దేశంలో అతి పెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసులు భావిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే… బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నదీ ప్రాంతంలోని అడవుల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి, ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి జవాన్లకు గాయాలు కాగా చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో డీఆర్‌జి అండ్ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్లు పాల్గొన్నారు. ఎన్ కౌంటర్ స్థలం నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, ఏకే 47, ఎస్ఎల్ఆర్, ఇస్తాఫ్ రైఫిల్, 303 బీపీఎల్ లాంచర్ స్వాధీనమయ్యాయి. ఇంద్రావతి నదీ ప్రాంతంలోని అడవుల్లో భద్రతా బలగాలు ఇంకా జల్లెడపడుతున్నాయి. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాదిలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో 100 మంది వరకు మరణించారు. గత నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 48 మంది మావోయిస్టులు మృతి చెందారు.
జగిత్యాల జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్!.. 11 వాహనాలు స్వాదీనం?
కెసిఆర్ రంగంలోకి దిగితే… రేవంత్ రెడ్డి అయితే ఏంటయ్యా : హరీష్ రావు