
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో :- హైకోర్టుకు చేరిన నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి.. తన డిబార్ ను రద్దుచేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు..
వివరాల్లోకి వెళితే…
నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన ఝాన్సీ లక్ష్మి ని టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో డిబార్ చేసిన విషయం తెలిసిందే.. కాగా తన డిబార్ ను రద్దు చేసి, తనను పరీక్షలు వ్రాయడానికి అనుమతించాలని కోరుతూ విద్యాశాఖ సెక్రటరీ,బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రెటరీ, నల్గొండ డీఈవో, ఎంఈఓ, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ లను ప్రతివాదులుగా పేర్కొంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.