
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రోజురోజుకు కొత్త కోణాలు కనపడుతున్నాయి. తాజాగా మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను నిన్న ఘనంగా ప్రారంభించారు. అయితే ఆ మార్గంలో న్యూజివీడు సీతారాంపురం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు నారా లోకేష్ కు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది కార్యకర్తలు అలాగే అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మా కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ని మీరు ఒకసారి తీసుకోండి అని నారా లోకేషన్ కోరారు. ఇక వెంటనే ఆలోచించకుండా నారా లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ని తన చేతిలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులను అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఆనందాన్నిచ్చారు. దీంతో అక్కడున్నటువంటి అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా విజిల్స్ వేస్తూ, కేరింతలతో తెగ సందడి చేశారు. కాగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు… బ్లాక్ స్పాట్ లను సందర్శించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర
తెలుగుదేశం పార్టీ పక్కన పెడితే.. రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ అసలు దగ్గరే అవడం లేదు. ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా సీఎం, సీఎం అని తెగ ఫ్లెక్సీలు కడుతూ ఎక్కడ తెలుగుదేశం పార్టీ మీటింగులు జరిగినా కూడా సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కొన్ని కొన్ని సందర్భాలలో పార్టీ రాజకీయ నాయకులకు అవి కొంచెం కష్టంగానే అనిపించినా ఏమి చేయలేక అలా వదిలేశారు. అయితే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు.. మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పట్టుకోవడం పార్టీకి బలము అవుతుందా లేక పార్టీ కి నష్టమా అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇక మరోవైపు సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ పై ప్రశంసలు వెదజల్లుతున్నాయి. ఒక మంత్రి అయ్యుండి… అభిమానుల కోరిక మేరకు ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకోవడం చాలా మంచి నిర్ణయం అని నారా లోకేష్ ను పొగుడుతున్నారు.
రంజాన్ పర్వదినం సందర్భంగా సరుకులు పంపిణీ చేసిన డాక్టర్ టిప్పు