
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- IPL 2026 కి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వెలువడింది. ఇంతకుముందు వచ్చిన కీలక ప్రకటనలలో ఈ ఐపిఎల్ 2026 మొదటి మ్యాచ్ మార్చి 15న ప్రారంభమవుతుంది అని నిర్వాహకులు ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ IPL 2026 తొలి మ్యాచ్ మార్చి 26న జరుగుతుంది అని తాజాగా క్రిక్బజ్ వెల్లడించింది. మార్చి 26న మొదటి మ్యాచ్ ప్రారంభమై మే 31వ తేదీన చివరి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అని తెలిపారు.
Read also : ఆహా ఎట్టకేలకు తగ్గిన నిరుద్యోగ రేటు.. PLFS కీలక నివేదిక వెల్లడి!
కాగా మరో వైపు ఇవాళ అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం జరుగునుంది. ఈ మినీ వేలంలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ ప్లేయర్లు కాచుకుని ఉన్నారు. ఏ ప్లేయర్కు ఎంత డబ్బు వెచ్చించాలి అని ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు పూర్తిస్థాయిలో ఆరా తీశాయి. కెమెరాన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్, పతి రానా, హసరంగా, రవి బిస్నోయ్, వెంకటేష్ అయ్యర్, డికాక్, నోకియా, జెన్నీస్మిత్, పృద్విషా అలాగే సరఫరాజ్ కాన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మరి ఈ ప్లేయర్లు అందరిని కూడా ఏ ఏ జట్లు కొనుగోలు చేస్తాయి అనేవి ఆస్తిరకరంగా మారింది. కోల్కత్తా జట్టు వద్ద 64 కోట్లతో ఎక్కువ డబ్బు ఉన్న జట్టుగా మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ లిస్టులో ముంబై దగ్గర 2.75 కోట్లతో అతి తక్కువ డబ్బులు గల జట్టుగా చివరి స్థానంలో నిలిచింది. దీంతో ఎక్కువమంది ప్లేయర్స్ ను కోల్కత్తా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
Read also : Sydney Shooting: ఆ ఉగ్రవాదులు పాకిస్థానీలే.. వెల్లడించిన ఆస్ట్రేలియా!





