
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది అని.. లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర మృతి చెందారు అని ఇవాళ ఉదయం అన్ని మీడియా చానల్స్ లలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ వార్తలు అని.. ధర్మేంద్ర కూతురు నటి ఇషా డియోల్ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉంది అంటూ అతను చనిపోలేదంటూ ఆమె వెల్లడించారు. కాగా గత కొద్ది రోజుల నుంచి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర ఇవాళ ఉదయం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లుగా అనేక వార్తలు వచ్చాయి. ఈ సందర్భంలోనే పలు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ లలో ఇతను చనిపోయాడు అంటూ తప్పుడు వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ సందర్భంలోనే తన కూతురు ఈశా డియోల్.. మా తండ్రిగారు ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు… అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేసింది. బాలీవుడ్ సూపర్ మాన్ గా పిలవబడేటువంటి ధర్మేంద్ర తన జీవితంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలలో నటించి జన హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఇతను చనిపోయాడని పలువురు ప్రేమికుల సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. అంతలోని తన కూతురు ఇలా బ్రతికి ఉన్నారు అని చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
Read also : బాంబు ఘటనకు పాల్పడేవారు ఊపిరి పీల్చుకునే లోపు లేపేస్తాం : బీజేపీ
Read also : హైదరాబాదులో పెద్ద ఎత్తున సామూహిక విష్ప్రయోగానికి ప్రణాళిక..!





