
నారాయణపేట, క్రైమ్ మిర్రర్:-పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరుల కోసం భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని 15 మసీదులలో శుక్రవారం వివిధ రకాల పండ్లను పంపిణీ చేశారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఫౌండేషన్ సభ్యులు ఆయా మసీదుల ప్రతినిధులను, మసీదుల పెద్దలను కలిసి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటే ముస్లిం సోదరులకు పండ్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పండుగలను కలిసిమెలిసి జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, హన్మంతు, శివరాజ్, ఎం.సంతోష్, రుద్రారెడ్డి, నర్సింహ నాయుడు, చామకూర నగేష్, బసుదే అశోక్, ముస్లిం సోదరులు, మసీదుల నిర్వాహకులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో దారుణం… మైనర్ బాలికపై అత్యాచార యత్నం… !
పోలవరం కాంట్రాక్టర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం – బ్లాక్‌లిస్టులో పెడతానంటూ హెచ్చరిక