
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవo పురస్కరించుకొని మహాదేవపూర్ బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ గారి అధ్యక్షతన బీజేపీ గద్దె వద్ద భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించినా అనంతరం మహాదేవపూర్ ప్రతీ బూతులలో కూడా బీజేపీ జెండాను ఆవిష్కరించడం జరిగింది,అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 06 తేదీన ఆవిర్బవించి నేటితో 45 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, 2 ఎంపీ సిట్ల తో మొదలయినా బీజేపీ నేడు దేశం లో వరుసగా 3 వ సారి అధికారం లో ఉందని, అలాగే ప్రపంచ దేశాలు అన్ని ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్నాయని దానికి కారణం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు, రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్, అలాగే మొన్న పార్లమెంట్ లో వాక్ఫు బోర్డు లో సవరణలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ సాధించిన చరితాత్మక విజయాలు ఎన్నో ఉన్నాయని, రానున్న రోజులలో బీజేపీ తెలంగాణాలో కూడా అధికారంలోకి వస్తుందని, బీర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఉచ్చిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నాయని, తెలంగాణాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అధిక మొత్తంలో సిట్లను కైవసం చేసుకొని సత్తా చాటుతుందని, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడడం జరిగింది, ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్, బీజేపీ నాయకులు, కన్నెబోయిన ఐలయ్య, ఆడుప లక్ష్మీనారాయణ, సాగర్ల రవీందర్, పూర్ణచేందర్,నాగుల సాయి, రాకేష్, రాజు, రాంకీ,సాయి, సంపత్, సంతోష్, హస్సి, చింటూ,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కల్తీ మద్యం గుట్టు రట్టు…కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.