
– రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల
– గతం మూడు గరిష్టంగా 45 డిగ్రీల నమోదు
– ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇటీవల అకాల వర్షాలతో కాస్త బ్రేక్ ఇచ్చినా.. తిరిగి ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిప్పుల కుంపటిని తలపిస్తున్నది.
పెండ్లిళ్ల సీజన్ కాగా..
ఉదయం పదకొండు ముండి సాయంత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి అప్రకటిత కర్ఫ్యూను తలపింస్తోంది, కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం సాగించాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం పెండ్లిళ్ల సీజన్ కాగా, దగ్గరి బంధువులు తప్ప ఎవరూ వెళ్లడం లేదు. వివాహ వేదికలు వెలవెలబోతున్నాయి. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు.. ఏసీలను విపరీతంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మే.. నెలలో సూర్య ప్రతాపం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
*జాగ్రత్తగా ఉండాలి..*
ఎండలు ముదిరాయి. వడగాల్పులు వీస్తున్నాయి. ఎండలో ఎకువ సమయం గడిపేవారు వడదెబ్బ బారినపడకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నూలు దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగును ఉపయోగించాలి. ఎక్కవ సమయం నీడ ప్రదేశాల్లో ఉండేలా చూసుకోవాలి. మజ్జిగ, ఓఆర్‌ఎస్ తీసుకుంటే వడదెబ్బ భారీ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని వైద్యశాలకు వెళ్లాలి.
– డాక్టర్ ప్రమోద్ కుమార్, మెడికల్ ఆఫీసర్
*వెదర్ అలర్ట్..*
తెలంగాణలో రాగాల 4 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణముతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రముముగా 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశముంది.