ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

బెట్టింగ్ సమయం… యువకుల ఫోన్లను తనిఖీ చేస్తున్న పోలీసులు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో యువత ఎక్కువగా బెట్టింగ్ కు అలవాటు పడిపోయారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. తాజాగా ఐపిఎల్ 2025, 18వ సీజన్ చాలా ఘనంగా ప్రారంభమైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. క్రికెట్ అంటే ఎంత మజా వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాలలోని ప్లేయర్స్ అందరూ కూడా ఒకటై ఆడుతున్న లీగ్ ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ . స్టార్ ప్లేయర్లందరూ కూడా ఇందులో ఆడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు బెట్టింగ్ రాయుళ్లపై ఎప్పటికప్పుడు నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు బెట్టింగ్ మరోవైపు సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఒక కన్నేసి ఉంచారు. బెట్టింగ్ లోనూ లేదా సైబర్ మోసగాళ్ల గా ఎవరైనా దొరికినా లేదా పట్టుబడిన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్లను కేవలం వినోదం కోసమే చూడాలని కోరారు.

కదలుతున్న రైలులో అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు బస్టాండ్ వద్ద డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కనపడిన ప్రతి యువకుడి ఫోన్లను చెక్ చేశారు. బెట్టింగ్ యాప్స్ అలాగే సింగల్ నెంబర్ వాడేవారినీ కొంతమందిని గుర్తించారు. దాదాపుగా 300 మంది అనుమానితులను తనిఖీ చేసి… 5500 రూపాయలను సీజ్ చేశారు. యువత బెట్టింగ్ కు అలవాటై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తనిఖీ చేసిన ప్రతి ఒక్క యువకుడిని డిఎస్పి శ్రీనివాసరావు కోరారు. ఇకపై అనూహ్యంగా ఎప్పటికప్పుడు యువకులపై తనిఖీలు చేస్తామని తెలిపారు. కాబట్టి యువత బెట్టింగులకు అలవాటు పడొద్దని పోలీసులు హెచ్చరించారు.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తడకమళ్ళ గ్రామ కాంగ్రెస్ నేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button