తిరుమల స్వామి వారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చిన భక్తుల తోపులాట, తొక్కిసలాట కారణంగా ఆరుగురు మరణించడం అత్యంత బాధాకరమైన విషయమని బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. తాజాగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. స్వామి వారి దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు వస్తారని ముందుగానే అంచనా ఉన్నప్పటికీ.. టీటీడీ పాలకమండలి,అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇది తగదని పేర్కొన్నారు.
Read More : తిరుపతికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి!..
ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలనీ ఆయన డిమాండ్ చేసారు. అధికార పార్టీ పెద్దలు, ప్రజా ప్రతినిధుల సేవలో తరిస్తూ, సామాన్య భక్తుల మరణాలకు పరోక్షంగా కారణమైన టీటీడీ పాలకమండలి మొత్తం రద్దు చేయాలని చైర్మన్ వెంటనే తప్పుకోవాలని ఆర్సీవై డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Read More : కాంగ్రెస్ నేతలను రోడ్లపై తిరగనీయం.. బండి సంజయ్ వార్నింగ్
“టీటీడీ అధికారులు కానీ, పాలకమండలి కానీ.. ఉత్తుత్తి ప్రచారానికి ఇస్తున్నంత సమయం ఏర్పాట్ల కోసం ఇవ్వలేదు అనిపిస్తుంది. టోకెన్లు జారీ కేంద్రాలు సమాచారం సరిగా లేదు, లక్షలాది భక్తులకు తగిన ఏర్పాట్లు లేవు, భక్తుల భద్రత విషయంలో ఏమరుపాటు తగదన్నారు. ఇంకా దర్శనాలు ఆరంభం కాకుండానే ఈ ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు టీటీడీ తరపున ఆదుకోవాలి అని వీలైతే వారి కుటుంబ సభ్యులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వాలి అని అలాగే రానున్న రోజుల్లో ఏ ఒక్క ప్రాణము పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం టీటీడీ పాలకమండలి, ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిలో ఏమాత్రం అలసత్వం తగదు.. వైకుంఠ ద్వారా దర్శనాలు జరిగినన్ని రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.