
-
బీసీ రిజర్వేషన్లపై కీలక పరిణామం
-
ఆర్డినెన్స్‌ను ఆమోదించాలని గవర్నర్‌కు పంపిన సర్కార్
-
న్యాయ సలహా కోసం కేంద్రానికి పంపిన గవర్నర్
-
బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ మరింత జాప్యం!
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మరింత జాప్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ పట్టుదలతో ఉంది. ఆమోదం తెలపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ పంపింది. అయితే న్యాయ సలహా కోరుతూ ఆర్డినెన్స్‌ను కేంద్ర హోంశాఖకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంపారు. దీంతో హోంశాఖ వద్ద ఈ ఆర్డినెన్స్ ఎన్నాళ్లు ఉంటుందనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం విధితమే.
Read Also: