నిర్మల్, క్రైమ్ మిర్రర్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో విషాదం చోటు చేసుకుంది. ఈ1 మొదటి సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటనతో తోటి విద్యార్థులంతా భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థులందరూ తరగతి గదిలోకి వెళ్లాక హాస్టల్‌లో ఎవరులేని సమయంలో హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యార్థిని హుటాహుటీన బైంసా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతురాలు వనపర్తి జిల్లాకు చెందిన వసంతగా గుర్తించారు. పోలీసులు వసంత తల్లిదండ్రులకు సమాచారం తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ ముందు పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పోలీసులు కేసు నమోదుచేసుకొని విద్యార్థిని మృతికి గల కారణాలు అడిగితెలుసుకుంటున్నారు.

