Homeక్రైమ్Gold Stealing: బ్యాంకు ఉద్యోగి బరితెగింపు, లాకర్ల నుంచి కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేసి..

Gold Stealing: బ్యాంకు ఉద్యోగి బరితెగింపు, లాకర్ల నుంచి కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేసి..

  • బెంగళూరులో బ్యాంకు ఉద్యోగి ఘరానా మోసం
  • లాకర్ల నుంచి రూ. 3.5 కోట్ల విలువైన బంగారం దొంగతనం
  • ఆ బంగారంతో ఆన్ లైన్ లో బెట్టింగ్స్ ఆడిన వైనం

కస్టమర్లకు అండగా నిలవాల్సిన బ్యాంక్ ఉద్యోగి బుర్రలో చెడు ఆలోచన మొదలయ్యింది. బెట్టింగ్ పిచ్చితో కస్టమర్లను దారుణంగా మోసం చేశాడు. బ్యాంకు లాకర్ల నుంచి ఏకంగా రూ.3.5 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించాడు. ఆ బంగారంతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందటే?

బెంగళూరులోని ఓ బ్యాంక్‌లో పని చేస్తున్న డిప్యూటీ మేనేజర్ ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు బానిస అయ్యాడు. బెట్టింగ్‌లు ఆడటానికి డబ్బుల కోసం కన్నింగ్ ప్లాన్ వేశాడు. తను పని చేసే బ్యాంక్ లాకర్లలోని బంగారాన్ని టార్గెట్ చేశాడు. ఉన్నతాధికారులకు తెలియకుండా లాకర్లనుంచి ఏకంగా 2.7 కేజీల బంగారాన్ని దోచేశాడు. ఆ బంగారాన్ని ఓ ఫినాన్స్ కంపెనీలో తనఖా పెట్టాడు. వచ్చిన డబ్బులతో ఆన్‌లైన్‌లో బెట్టింగులు ఆడాడు. బ్యాంకు లాకర్ల నుంచి పెద్ద మొత్తంలో బంగారం పోయిందని గుర్తించిన చీఫ్ మేనేజర్.. గిరి నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిబ్రవరి 5వ తేదీన దొంగతనంపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు డిప్యూటీ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

రూ.3.5 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించినట్లు గుర్తింపు   

పోలీసుల దర్యాప్తులో నిందితుడు రూ.3.5 కోట్ల విలువ చేసే బంగారాన్ని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని కూడా రాబట్టే పనిలో పడ్డారు. “ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ బ్యాంక్ మేనేజర్‌ను అరెస్ట్ చేశాం. బంగారాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నాం. ఇప్పటి వరకు 700 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశాం. ఫినాన్స్ కంపెనీ వాళ్లు మాకు సరిగా సహకరించటం లేదు. మేము కోర్టు ద్వారా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని  డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లోకేశ్ వెల్లడించారు.

Read Also: మహిళా జర్నలిస్ట్ హత్య కేసు.. ఎనిమిదేళ్ల తర్వాత బయటపడ్డ అసలు కథ!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments