
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ అయినటువంటి తమిమ్ ఇక్బాల్ ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. తాజాగా తమిమ్ఇక్బాల్ చికిత్స తీసుకుంటున్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగాఢాకా ప్రీమియర్ లీగ్ లో భాగంగా గ్రౌండ్ లోనే కుప్పకూలిన తమీమ్ఇక్బాల్ ను అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్బాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీయూ బెడ్ పై ఉన్న తమీమ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే నోట్లో పైపులు పెట్టి.. వైద్యులు అతన్ని బ్రతికించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తమీమ్ ఫాన్స్ అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు తమీమ్ కు ఏమి
జరగకూడదని, వెంటనే కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులతో పాటు కామెంట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!.. తమిళ ప్రజలు కోరుకుంటే కచ్చితంగా పార్టీని స్థాపిస్తా?
కాగా ఎన్నో సంవత్సరాలుగా బంగ్లాదేశ్ దేశానికి క్రికెట్ ఆడుతూ ప్రేక్షకులను అలరించిన తమీమ్ ఒకసారిగా గుండెపోటుతో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న పరిస్థితిని చూసి బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. టెస్టులు, ఓడీలు మరియు టి20 లు ఎన్నో మ్యాచులు ఆడిన అనుభవం ఒక్కసారిగా ఆవిరైపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితి చాలా విషమంగా ఉంది. బతుకుతాడో, లేదో అని చాలామంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో ప్రతి ఒక్కరిలోనూ భయం మొదలైంది.
పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!.. తమిళ ప్రజలు కోరుకుంటే కచ్చితంగా పార్టీని స్థాపిస్తా?