క్రైమ్ మిర్రర్ : వచ్చే సంక్రాంతి లోపు ‘ఫీజు రీయంబర్స్ మెంట్’’ మెత్తాన్ని చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తరువాత మహోద్యమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు. అట్లాగే ఇఛ్చిన మాట మేరకు కట్టుబడి వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ‘దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్’ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్ లో చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను సన్మానించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. బిశ్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి 4 ఏళ్లయినా… వాటిని భర్తీ చేయలేదని బండి సంజయ్ అన్నారు.అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందన్నారు.
Read Also : కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత
25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి… 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గప్పాలు కొడుతోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల నిరుద్యోగులు ఉద్యోగాల్లే ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు బండి సంజయ్. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2022 అక్టోబర్ లో ప్రకటించిందని.. ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు ఇచ్చిన హమీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని బండి సంజయ్ ఆరోపించారు. నిరుద్యోగులకు రూ.4 వేల భ్రుతి ఇస్తామని మాట తప్పిందని.. ఒక్కో నిరుద్యోగికి రూ.48 వేలు బకాయి పడిందని అన్నారు. వెంటనే ఆ బకాయి ఇవ్వాలి.. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి..లేనిపక్షంలో బీజేపీ పక్షాన తీవ్రమైన ఆందోళనలు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. దీంతోపాటు ఫీజు రీయంబర్స్ మెంట్ అందక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడుతున్నరని అన్నారు. కాలేజీల యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు మూసుకునే దుస్థితి తలెత్తిందన్నారు. విద్యార్థులపై ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని.. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నరని సంజయ్ అన్నారు.
Also Read : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన
అందుకే ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం… సంక్రాంతిలోపు బకాయిపడ్డ ఫీజు రీయంబర్స్ మెంట్ సొమ్మును చెల్లించాల్సిందే.. లేనిపక్షంలో కిషన్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు బండి సంజయ్. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్లు సూపర్ ప్రధానిగా సోనియాగాంధీ కొనసాగుతూ రబ్బర్ స్టాంప్ గా మార్చిందని విమర్శించారు. అట్లాగే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రజాప్రతినిధ్యం చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే, ఆ ఆర్డినెన్స్ కాపీలను రాహుల్ గాంధీ చింపివేసి మన్మోహన్ ను దారుణంగా అవమానించారని అన్నారు. కానీ మన్మోహన్ సింగ్ సేవలను గుర్తించి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు ఢిల్లీలోనే స్మారక స్థల్ నిర్మించేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్దమైందన్నారు. కానీ మాజీ ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహరావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. అలాంటి కాంగ్రెస్ నేతలకు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేనేలేదన్నారు బండి సంజయ్.
ఇవి కూడా చదవండి :
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ రెగ్యలర్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా
- 12 సంవత్సరాల తర్వాత… బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
- చరణ్ సినిమా ఈవెంట్ కు డిప్యూటీ CM ను ఆహ్వానించిన దిల్ రాజ్!..
- మద్యం ప్రియులకు పండగే.. పండగ… వైన్స్ షాపులు, బార్ల సమయ వేళలపై ప్రభుత్వం కీలక నిర్ణయం