తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై అంత పగ పట్టినట్లు మాట్లాడడం చాలా దారుణమని బిజెపి జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేశం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీపై ఎందుకు అంత కోపం అని ప్రశ్నించారు.
అల్లు అర్జున్ ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది : అల్లు అరవింద్
ముగిసిపోయిన సమస్యలు కావాలనే మళ్లీ తెరపైకి తీసుకు వచ్చారని బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. కావాలనె MIM సభ్యుడితో ప్రశ్నను అడిగించి మరి సమాధానం చెప్పారు. సినిమా తరహాలో మీరే మళ్లీ కథలు అల్లుకొని ఒక ప్లాన్ ప్రకారం పథకాన్ని రచించుకొని అసెంబ్లీ వేదికగా సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా వ్యవహరించడం చాలా దారుణమని చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్‌వి పచ్చి అబద్దాలు.. తగ్గేదే లేదన్న పుష్ప
రేవంత్ రెడ్డి మాట్లాడినవి అన్నీ కూడా పక్క ప్లాన్ ప్రకారం చేశాడని అన్నారు. ఇప్పటికైనా కక్షపూరిత మాటలు అలాగే కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అల్లు అర్జున్ గురించి అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా రేవంత్ రెడ్డి మాట్లాడిన పలు మాటలు పై చాలా మంది కూడా చర్చించుకుని తప్పు ఒప్పులను తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా అల్లు అరవింద్ కూడా తన కొడుకు పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అన్న విషయం కూడా మనకు తెలిసిందే. కాగా మరో వైపు పుష్ప సినిమా వసూళ్లలో దూసుకుపోతుంది.