
-
పోలవరం-బనకచర్లపై పార్లమెంట్‌లో ప్రస్తావన
-
బనకచర్ల పనులు చేపట్టలేదని ఏపీ సర్కార్ చెప్పింది
-
ప్రాజెక్టు సాంకేతిక, ఫైనాన్స్ అంచనా కోసం కసరత్తులు
-
ప్రాజెక్టు విషయంలో కేంద్రం తగిన ప్రక్రియను అనుసరిస్తుంది
-
నది పరీవాహక రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నాం
-
కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం
క్రైమ్‌మిర్రర్, న్యూఢిల్లీ: ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదని కేంద్రం తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రాజెక్టు పనులు ఇంకా స్టార్ట్ కాలేదని ఏపీ ప్రభుత్వం తెలిపిందని చెప్పుకొచ్చింది. బనకచర్ల ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక అంచనాలపై కసరత్తులు చేస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం తగిన ప్రక్రియను అనుసరిస్తుందన్నారు. గోదావరి నదీ పరివాహక రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుందన్నారు.
కాగా, ప్రతి ఏటా గోదావరి నుంచి 2వేల టీఎంసీల నీరు గోదావరిలో కలుస్తోందని, ఇందులో నుంచి 200 టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకునేలా బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు ఏపీ చెబుతోంది. సుమారు రూ.80వేల కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు సమర్పించినట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతానికి తాగునీటితోసహా కొత్తగా 3లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
Read Also: