సినిమా

హౌస్ ఫుల్…! నాలుగు రోజుల్లోనే భారీగా కలెక్షన్లు

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చినటువంటి కాంతారా చాప్టర్-1 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా 310 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినిమా వర్గాలు తెలిపాయి. కేవలం నిన్న ఒక్కరోజులోనే 65 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని ఈ చిత్ర బృందం ప్రకటించింది. అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ రోజు పురస్కరించుకొని ఈ సినిమా రిలీజ్ అవ్వగా.. పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఈ సినిమా మొదటి రోజు 70 కోట్లకు పైగా వసూలు చేయగా.. వీకెండ్ కావడంతో మొత్తం నాలుగు రోజులు కలుపుకొని 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా అందరి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. మరోవైపు బుక్ మై షో లో ఈ సినిమా ఆదివారం మధ్యాహ్నం వరకు ఏకంగా 50 లక్షల కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలానే కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో ఈ చిత్రం కచ్చితంగా 500 కోట్ల కలెక్షన్ల గ్రాస్ రాబడుతుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా 1000 కోట్లు కూడా దాటుతుందని రిషబ్ శెట్టి ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా చాలా కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయిందో.. రెండవ భాగం కూడా అంతే సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. దీంతో విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లు కూడా హౌస్ ఫుల్ బోర్డు తలపిస్తున్నాయి.

Read also : తెలంగాణలో వైరల్ అవుతున్న మైనర్ల ట్రాప్ హౌస్ పార్టీ.. చివరికి ఏమైందంటే?

Read also : చర్యలకు సిద్ధం… నేను కూడా రెడీ అంటున్న విజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button