
గుంటూరు, క్రైమ్ మిర్రర్ :- ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుళ్లూరులో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.బాలకృష్ణ మాట్లాడుతూ, “గతంలో తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం” అని గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కొందరు నాయకులు రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ, “వాళ్ల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు… కానీ సమయం వచ్చినప్పుడు తాటతీస్తాం” అని వ్యాఖ్యానించారు.
Read also : రావిర్యాల చేరువు కట్టకు పొంచి ఉన్న ముప్పు.. భారీ స్థాయిలో ఏర్పడిన గండి?
బాలకృష్ణ, “దుష్ప్రచారం చేస్తే వాళ్ల తలలు తీసేయాలి” అని చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఈ వ్యాఖ్యను ప్రతిపక్షాలపై విమర్శల రూపంలో చేసినప్పటికీ, మాటల మాధుర్యం కాకుండా పదజాలం తీవ్రతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నాయకులు దీన్ని ప్రతీకాత్మకంగా చెప్పారని వాదిస్తుండగా, వైసీపీ నేతలు దీనిని ప్రమాదకర వ్యాఖ్యగా ఖండిస్తున్నారు. కూడా నందమూరి బాలకృష్ణ ఒక స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.
Read also : తెలంగాణ బీజేపీలో సైంధవులు..!