
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- హిందువుల అతి ముఖ్య పండుగలలో శ్రీరామనవమి ఒకటి. మన భారతదేశంలో గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, అయోధ్య నగరంలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది మన దేశంలోనే అతిపెద్ద ఆలయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది దేశ, విదేశా ప్రముఖుల అందరి నడుము మధ్య ఈ ఆలయం లో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే తాజాగా అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య ఆలయం సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఆలయం చుట్టూ కూడా బాగా ముస్తాబు చేశారు. ఏప్రిల్ 6న జరిగే శ్రీరావనవమి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ వీక్షించేలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఆయా నగరాలలో కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్ లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
మన భారతదేశంలోనే హిందువుల అతిపెద్ద ఆలయం కాబట్టి భారీగా భక్తులు కదలి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయోధ్యలో ప్రతిష్టించిన శ్రీరాముని దర్శనం కోసం ఇప్పటికే చాలామంది భక్తులు వెయిటింగ్ చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 6న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు అయోధ్య ఆలయ అధికారులు
ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు. ఎంతోమంది భక్తులకు ఆశ్రమాలలో వసతి సౌకర్యం కల్పించనున్నారు. భారీగా భక్తులు కదిలి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు భక్తులకు ఇబ్బందిగా మారకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీస్ అధికారులు అలాగే ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు. స్వామివారి కల్యాణాన్ని మన భారతదేశ వ్యాప్తంగా వీక్షించేలా లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దీంతో దూరపు ప్రయాణాలు చేయలేని ముసలివారు లేదా భక్తులు టీవీలలోనే లైవ్ టెలికాస్ట్ ను చూడవచ్చు. దీంతో ఇన్ని ఏర్పాట్లను చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. హిందువుల పండుగలలో శ్రీరామనవమి ఒక ముఖ్యమైన పండుగ కాబట్టి ప్రతి ఒక హిందువు కూడా ఈ స్వామివారి దర్శనాన్ని తిలకించడానికి భారీగా తరలివస్తారు.