
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-తెలంగాణ రాష్ట్ర రోడ్డు భద్రతా సెల్ (పోలీస్, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్ విభాగాలు) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆరైవ్ ఆలైన్–2026” రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా తవక్కల్ హై స్కూల్ విద్యార్థులకు పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాల పాటింపు, హెల్మెట్–సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై విద్యార్థులకు వివరించారు. అవగాహన కార్యక్రమంతో పాటు విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన స్థాయిని పెంపొందించే ఉద్దేశంతో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను కూడా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే ఈ కార్యక్రమం లక్ష్యమని పట్టణ ఎస్సై భూమేష్ తెలిపారు.
రిపబ్లిక్ డే వేడుకలపై ఉగ్ర ఛాయలు.. నిఘా వర్గాల హెచ్చరిక.!
మేడారంలో వేడి నీటి బకెట్ 50 రూపాయలు.. వైరల్ అవుతున్న దృశ్యాలు?





