
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని బ్రిలియంట్ స్కూల్లో ఎన్ఆర్ఐ గుమ్మి దయానంద్ రెడ్డి సోమవారం రోజున విద్యార్థులకు టూత్ బ్రష్ పేస్ట్ టంగ్ క్లీనర్ కిట్లు గ్రామ సర్పంచ్ బిసు ధనలక్ష్మి చందర్ గౌడ్ చేతుల మీదుగా పంపిణి చేసారు. అలాగే విద్యార్థులకు నేతాజీ యువజన మండలి సభ్యులకు క్రికెట్ కిట్లు పంపిణి చేసారు. విద్యార్థులకు దంత సంరక్షణపై అవగాహాన కల్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ ప్రతికంఠం పూర్ణచందర్ రాజు అధ్యక్షత వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ పావని కోటేశ్వరి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఏనుగు వెంకటరామిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్,వార్డు సభ్యులు,పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, యువజన మండలి అధ్యక్షులు దొంతరబోయిన మురళీకృష్ణ, ప్రతికంఠం శంతన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.





