క్రైమ్తెలంగాణ

కొండాపూర్‌లో డ్రగ్స్‌తో రేవ్‌ పార్టీ భగ్నం.. 11 మంది అరెస్ట్‌

హైదరాబాద్ (క్రైమ్ మిర్రర్):- హైదరాబాద్ నగర శివారులోని కొండాపూర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఓ విలాసవంతమైన విల్లాలో రేవ్ పార్టీని ReveParty ఎక్సైజ్‌ అధికారులు భగ్నం చేశారు. ఈ ఘటనలో 11 మందిని అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకులు కావడం గమనార్హం.ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టయిన వారు మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. దాడుల సందర్భంగా భారీగా గంజాయి, నిషేధిత డ్రగ్స్‌ను #ProhibiteDrugs స్వాధీనం చేసుకున్నారు.
శ్రావణమాసం ఆగమనం… తగ్గిన చికెన్ ధరలు!
ఈ పార్టీని నిర్వహించిన వ్యక్తి విజయవాడకు చెందిన అశోక్‌నాయుడు అని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా కొండాపూర్ పరిసరాల్లో రహస్యంగా రేవ్‌ పార్టీలు నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేపట్టాయి.పట్టుబడిన వారి నుంచి మరికొంతమంది వివరాలు సేకరిస్తున్నామని, ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.
ఆదాయం తక్కువ… అప్పులు మాత్రం విపరీతం : వైఎస్ జగన్

Back to top button