
-
విద్యానగర్ ఆంధ్ర మహిళాసభ ఆస్పత్రిలో ఘటన
-
బాధితురాలి అరుపులతో వెలుగులోకి ఘటన
-
నిందితుడిని పట్టుకొని చితకబాదిన స్థానికులు
క్రైమ్ మిర్రర్, నిఘా: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వార్డుబాయ్… ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విద్యానగర్‌లోని ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన రోగి బంధువులు, స్థానికులకు వార్డ్ బాయ్‌కి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.