క్రైమ్

తెలంగాణలో ఆలయాలపై దాడులకు ప్రత్యేక దళాలు వచ్చినయా?

హనుమాన్ ఆలయంలో నవగ్రహాలను ధ్వంసం చేశారు.. ఆ ఘటన మరవక ముందే శంషాబాద్ లోనే మళ్లీ గుడిని సల్మాన్ అనేటోడు దాడి చేసిండు.. వరుస ఘటనలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయాలను ధ్వంసం చేసేందుకు ప్రత్యేక దళాలు ఏమైనా వచ్చాయా?

తెలంగాణలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కల్గిస్తున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన తీవ్ర దుమారం రేపింది. నిందితుడు సలీంను పోలీసులు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కూడా వరుసుగా ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. శంషాబాద్ ఏరియాలో వారం రోజుల్లోనే మూడు గుడులపై దాడులు జరిగాయి. శంషాబాద్ హనుమాన్ ఆలయంలో నవగ్రహాలను ధ్వంసం చేశారు. తర్వాత మైసమ్మ ఆలయంలో త్రిశూలం ధ్వంసం చేశారు. తాజా జుక్కల్ గ్రామంలోని పోచమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహంపై దాడి చేశారు. కన్ను పీకి పక్కన పడేశారు.

ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. శంషాబాద్ హనుమాన్ ఆలయంలో నవగ్రహాలను ధ్వంసం చేశారు.. ఆ ఘటన మరవక ముందే శంషాబాద్ లోనే మళ్లీ గుడిని సల్మాన్ అనేటోడు దాడి చేసిండు.. వరుస ఘటనలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయాలను ధ్వంసం చేసేందుకు ప్రత్యేక దళాలు ఏమైనా వచ్చాయా? అనే అనుమానం కలుగుతోందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూసీ చూడనట్లు పోతోంది కాబట్టే ఏం చేసినా పట్టించుకోరని దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి వడ్ల కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బ్రోకర్ల నుండి కమీషన్లు దండుకునేందుకు రాష్ర రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారని ధ్వజమెత్తారు. వడ్ల పైసలన్నీ మిత్తీతోసహా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. అయినప్పటికీ వడ్లు కొనివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన మిత్తీతో సహా నొప్పి ఏందని ప్రశ్నించారు. ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంపైనా బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారు? 6 గ్యారంటీలు అమలు చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 లు ఇచ్చారని విజయోత్సవాలు చేసుకుంటారా? వ్రుద్దులకు రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇచ్చారని చేసుకుంటారా? పేదలకు ఇండ్లు ఇచ్చారని చేసుకుంటారా? దేనికోసం విజయోత్సవాలు…నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేసినందుకు ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి.’’అంటూ దుయ్యబట్టారు..

మరిన్ని వార్తలు చదవండి .. 

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ

Spread the love
Back to top button