
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై భారత్ స్పందిస్తూ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు మరియు మైనారిటీ క్రైస్తవుల పై జరుగుతున్నటువంటి దాడులు అత్యంత దారుణమని తాజాగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు. తాజాగా బంగ్లాదేశ్ లో ఒక హిందూ యువకుడిని హత్య చేయడాన్ని మేము ఖండిస్తున్నాము అంటూ పేర్కొన్నారు. ఈ హత్యకు కారణమైన నేరస్తులకు తగిన శిక్ష పడుతుంది అని మేము ఆశిస్తున్నాము అంటూ తెలిపారు. యునెస్ హయంలోనే మైనార్టీ పై దాడులకు సంబంధించి ఇప్పటికే 2900 కి పైగా కేసులు నమోదు అయ్యాయని.. దీని ద్వారానే బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం అవుతున్నాయి అని అన్నారు. ఈ బంగ్లాదేశ్ లో ప్రస్తుతం పరిస్థితులు చేజారిపోయాయని.. హత్యలు, మైనారిటీలపై దాడులు అలాగే భూకబ్జాలు కూడా ఎక్కువైపోయాయి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ లో ఒక దళిత హిందువును కిరాతకంగా చంపడమే కాకుండా అతని శవాన్ని చెట్టుకు వేలాడదీసి మరి కాల్చివేశారు. ఆ దేశంలోని మైనారిటీ హిందువులు మరియు క్రైస్తవులను కావాలని హింసిస్తున్నారు. అని ఈమధ్య సోషల్ మీడియాలో వార్తలు హైలైట్ అయిన విషయం తెలిసిందే.
Read also : వివాహానికి ముందు జంటలు ఏ వైద్య పరీక్షలు చేయించుకోవాలి?
Read also : కొడుకు వివాహేతర సంబంధం.. తండ్రిని వేటకొడవళ్లతో నరికిన ప్రత్యర్థులు





