Thursday, March 5, 2026
Homeఅంతర్జాతీయంModi Israel Visit: మోడీ పర్యటన తర్వాతే ఇరాన్‌పై దాడులు, ఆ మీటింగ్ లో అసలు...

Modi Israel Visit: మోడీ పర్యటన తర్వాతే ఇరాన్‌పై దాడులు, ఆ మీటింగ్ లో అసలు ఏం జరిగింది?

ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య గత ఐదు రోజుల నుంచి యుద్ధం నడుస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్, అమెరికా దళాలు సంయుక్తంగా ఇరాన్‌పై బాంబు దాడులు చేశాయి. ఇరాన్ నాయకులే లక్ష్యంగా టెహ్రాన్‌లోని 30 చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన దాడుల్లో ఖమేనీ చనిపోగా.. మరుసటి రోజు ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతి దాడులకు దిగింది.

ప్రధాని పర్యటన ముగిసిన రెండు రోజులకు..

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడానికి రెండు రోజుల ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు మోడీ పర్యటన సాగింది. మోడీ పర్యటన ముగిసిన సరిగ్గా రెండు రోజులకు.. ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడి చేసింది. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ, సోషల్ మీడియా ప్రచారాలపై స్పందించారు.

రూవెన్ అజర్ ఏం చెప్పారంటే?

“అదొక ఆపరేషనల్ అవకాశం మాత్రమే. ప్రధాని మోడీ వెళ్లిపోయిన తర్వాత ఆ అవకాశం వచ్చింది. మోడీ పర్యటన సందర్భంగా ఆయనతో దేశాభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాము. ఈ విషయం గురించి ఆయనతో చర్చించలేదు. దాడులు చేస్తామని ఆ సమయానికి మాకు కూడా తెలీదు. మోడీ వెళ్లిపోయిన తర్వాత ఇరాన్‌పై దాడి చేయాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల సమయం పట్టింది. ఇరాన్‌పై దాడులకు ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాతే దాడులు జరిపాము. దాడులకు చాలా కాలం ముందునుంచే మేము అమెరికాతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము’ అని రూవెన్ అజర్ వెల్లడించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments