
Attack: గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో రాజకీయ రంగాన్ని కుదిపేసిన ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆప్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా ఒక పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొని వేదికపై ప్రసంగిస్తుండగా, అక్కడికి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా ముందుకు దూసుకుని వచ్చి ఎమ్మెల్యేపై చెప్పు విసరడం సంచలనం రేపింది. రాజకీయ నాయకులు ప్రజల మధ్య కార్యక్రమాలు నిర్వహించే సమయంలో భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి ఇంత సమీపానికి వచ్చి దాడి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Jamnagar, Gujarat: During an AAP meeting in Jamnagar, a man threw a shoe at MLA Gopal Italia, causing brief chaos. Police restrained the individual, restored order, and some chairs were reportedly damaged pic.twitter.com/SXad764HCo
— IANS (@ians_india) December 5, 2025
మొత్తం సంఘటన క్షణాల్లో జరిగిపోయింది. ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా మాట్లాడుతున్న సమయంలో ఆ వ్యక్తి వేగంగా వేదిక ముందు వరకు చేరి నేరుగా తన చెప్పును విసరడం అక్కడ ఉన్న కార్యకర్తలు, పోలీసులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. చెప్పు ఎమ్మెల్యే శరీరాన్ని తాకకపోయినా, ఈ సంఘటనతో కార్యక్రమ వాతావరణం పూర్తిగా అల్లకల్లోలమైంది. వెంటనే ఆప్ పార్టీ కార్యకర్తలు స్పందించి అతడిని అడ్డుకొని దాడి చేయడం ప్రారంభించారు. కొద్ది క్షణాల పాటు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
అతను ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డాడు..? అతడి ఉద్దేశ్యం ఏమిటి..? ఇది వ్యక్తిగత అసహనమా లేక రాజకీయ నేపథ్యంలో జరిగిందా అనే ప్రశ్నలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చాలా వేగంగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియోలో వ్యక్తి ఒక్కసారిగా వేదిక వైపు పరిగెత్తి చెప్పు విసిరిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరు దీనిని భద్రతా విఫలం అని పేర్కొంటుండగా, మరికొందరు రాజకీయ అసహనం పెరిగిపోయిన సంకేతంగా భావిస్తున్నారు.
ALSO READ: Good News: జస్ట్ రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్





