
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్ పూర్ లో నలుగురు పిల్లలను తన తండ్రి గొంతు కోసి చంపేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజీవ్ కతేరియా అనే వ్యక్తి తన భార్య కుంతీదేవితో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్ పూర్ లో నివాసం ఉంటున్నారు. అయితే వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. స్మృతి, కీర్తి, ప్రగతి అనే ముగ్గురు ఆడపిల్లలు అలాగే రిషబ్ అనే ఒక మగ పిల్లవాడు ఉన్నారు. అయితే తాజాగా రాజీవ్ ఖతేరియా తన భార్య కాంతిదేవితో గొడవపడి.. ఆ కోపంలో తన నలుగురు పిల్లలను గొంతు కోసి దారుణంగా చంపేశాడు. అనంతరం తండ్రి రాజీవ్ కతేరియా కూడా తన భార్య చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే తనకు ఉన్న నలుగురు పిల్లలు కూడా ఐదు నుంచి 13 ఏళ్ల లోపు వారే. ఇక ఈ ఘటన జరిగిన తరువాత వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది. రాజు మెంటల్ హెల్త్ సరిగా లేదని పోలీసులు గుర్తించి తెలిపారు. ఏదేమైనా కూడా కన్న తండ్రి నలుగురు పిల్లలను గొంతు కోసి చంపడం అనేది చాలా దారుణమని చుట్టుపక్కల ప్రజలు అలాగే తన బంధువులు కోపానికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.