
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో :- సూర్యాపేట జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ( ఎస్ ) మండలం పాత సూర్యాపేట గ్రామంలోని వెంగమాంబ బాలాజీ హలో బ్రిక్స్ ఇటుక బట్టీ లో జరిగింది. ఇటుక బట్టీ లో పనిచేయడం కోసం బీహార్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఓ కుటుంబానికి చెందిన మైనర్ బాలికకు చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి బాలికను పట్టుకుని ఇటుక బట్టీ లోపలకు లాక్కెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడబోయిన ఇటుక బట్టీ యజమాని వెంకటరమణ. బాలిక కేకలు వేయడంతో వెంకటరమణ పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇటుక బట్టీ యజమాని వెంకటరమణ పై నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
పోలవరం కాంట్రాక్టర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం – బ్లాక్‌లిస్టులో పెడతానంటూ హెచ్చరిక
అమీన్‌పూర్‌లో దారుణం- పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్