పెరుగుతున్న టెక్నాలజీని మంచి కోసం కాకుండా చాలా మంది చెడుకోసం ఉపయోగిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్ విద్యార్థి ఏకంగా ఓ బిల్డింగ్ లోని సీసీటీవీని హ్యాక్ చేశాడు. ఆ విజువల్స్ ను చూసేందుకు ఏకంగా తన స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకున్నాడు. విషయం తెలిసి స్థానికులు ఎందుకు చేశామని నిలదీయడంతో అతడు చెప్పిన విషయం తెలిసి షాకయ్యారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన ఓ ఇంటర్ స్టూడెంట్.. ఓ బిల్డింగ్ కు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాను హ్యాక్ చేశాడు. ఆ ఇంట్లో అతడి స్నేహితురాలిది. హ్యాక్ చేసిన ఆ సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను తన మొబైల్ కు కనెక్ట్ చేసుకుని చూస్తున్నాడు. అలా పరిశీలిస్తూ.. ఆ బిల్లడింగ్ పరిసరాల్లోనే అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. అ అబ్బాయిని చూసి స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే అతడిని పట్టుకుని ఫోన్ చెక్ చేశారు. విషయం బయటపడింది. అతడిని పోలీసులకు అప్పగించారు.
సీసీ కెమెరాలను ఎందుకు హ్యాక్ చేశాడంటే?
పోలీసుల విచారణలో అతడు చెప్పిన విషయం విని అందరూ షాకయ్యారు. తన స్నేహితురాలు ఏం చేస్తోందోనని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకే ఇలా చేసినట్లు చెప్పాడు. అయితే.. అతడు ఎలా హ్యాక్ చేశాడనే విషయం బయటకు రాలేదు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాడు. అతడు మైనర్ కావడంతో జువైనల్ జస్టిస్ యాక్ట్-2015 కింద విచారణ కొనసాగిస్తున్నారు.
అటు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీకెమెరాలకు స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టుకోవాలని, డిఫాల్ట్ పాస్ వర్డ్ ఉంచకూడదని చెప్తున్నారు. యూట్యూబ్ లో చూసి సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్న ఘటనలు ఈ మధ్య చాలా వరకు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





