
-
రిటైర్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన అశ్విన్
-
ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డ్
-
221 మ్యాచ్‌లలో 187 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్
క్రైమ్‌మిర్రర్, స్పోర్ట్స్: దిగ్గజ స్పిన్ బౌలర్, భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అశ్విన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఐపీఎల్‌లు ఎక్కువ వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా అశ్విన్ రికార్డ్ సృష్టించారు. ఈ లీగ్‌లో 221 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 187 వికెట్లు తీశాడు.
అశ్విన్ తన కెరీర్‌లో సీఎస్కే, పంజాబ్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పుణె సూపర్ జెయింట్స్ వంటి ప్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. పంజాబ్‌కు కెప్టెన్‌గా పనిచేశాడు అశ్విన్. బౌలింగ్‌లోనే కాదు, బ్యాటింగ్‌లోనూ అశ్విన్ తనదైన ముద్ర వేశాడు. ఒక అర్థసెంచరీ చేసిన అశ్విన్ మొత్తం 833 పరుగులతో నిలిచాడు. గత చివరి సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన అశ్విన్… ఏడు వికెట్లు పడగొట్టాడు.
Read Also: