
• వసతి గృహాల అధికారులతో సమీక్ష
• వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి
• వసతి గృహాల ప్రిన్సిపాల్స్, స్పెషల్ ఆఫీసర్స్ ఆలోచనా విధానంలో మార్పు రావాలి
• విద్యార్థుల సంఖ్య, మౌలిక సదుపాయాల పై ఆరా
• మౌలిక సదుపాయల కల్పన కు మాస్టర్ ప్లాన్
మునుగోడు,క్రైమ్ మిర్రర్ : మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా బాలికల విద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సంఖ్య, అత్యవసరంగా చేపట్టాల్సిన పనులపై ఆయా రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, స్పెషల్ ఆఫీసర్లతో మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.మునుగోడు, చండూరు నాంపల్లి మర్రిగూడెం, నారాయణపూర్ చౌటుప్పల్ కేజీబీవీ లతో పాటు..నారాయణపూర్ లోని గిరిజన బాలుర సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, మునుగోడు లోని వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలోని మైనార్టీ బాలుర సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు… చౌటుప్పల్ పట్టణంలోని బంగారిగడ్డ లో గల తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీ బాలికల గురుకుల పాఠశాల, సర్వేల్ బాలుర సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొని ఉన్న సమస్యలు వాటి పరిష్కారం పై సుదీర్ఘంగా చర్చించారు…నాణ్యమైన విద్య ఎంత ముఖ్యమో విద్యార్థుల ఆరోగ్యం అంతకన్నా ముఖ్యమని, వసతి గృహాలలో సరిపడా బాత్రూమ్స్ టాయిలెట్స్, శుభ్రమైన కిచెన్ డైనింగ్, దోమలు రాకుండా కిటికీలకు మెష్ ఉండేలా చూసుకోవాలని తద్వారా విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని అన్నారు…నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఒక్కో రెసిడెన్షియల్ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, వారికి సరిపడా మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా బాలిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా మౌలిక సదుపాయాలు లేవని ఎమ్మెల్యే దృష్టికి స్పెషల్ ఆఫీసర్లు తీసుకొచ్చారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో అత్యవసరంగా చేసే పనులను గుర్తించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.”ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస అవసరాలు ( బేసిక్ నీడ్స్ ) తీర్చడానికి కావలసిన సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు”రెసిడెన్షియల్ పాఠశాలలను మైంటైన్ చేసే అధికారులు, ప్రిన్సిపాళ్ల ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించారు..రెసిడెన్షియల్ పాఠశాలల్లో పేద విద్యార్థులు చదువుతున్నారని ప్రతి ఒక్కరూ డెడికేటెడ్ గా పనిచేసి పరిణితి చెందిన విద్యార్థులను తయారుచేసి సమాజానికి అందించాలన్నారు..నియోజకవర్గ వ్యాప్తంగా వసతి గృహలలో మెరుగైన మౌలిక సదుపాయల కల్పన కు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని, రెసిడెన్షియల్ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనలో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.. డైట్ చార్జిలు పెంచిన తర్వాత కూడా భోజనంలో నాణ్యత పెరగలేదని విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చారని.. విద్యార్థులకు భోజనం ఎలా పెడుతున్నారనే విషయాలు తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు . ఈ సమీక్ష సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్ళు వివిధ మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అత్తింటి వేధింపులు అబద్దమేనా? మహిళా ఐపీఎస్ పై సుప్రీ ఆగ్రహం!
కృష్ణమ్మ పరవళ్లు.. తెరుచుకున్న శ్రీశైలం గేట్లు!