
హత్నూర, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి ఏప్రిల్ 29:- భానుడి భగ భగల నుండి కొద్ది సేపు సేద తిరుదామని వైన్ షాపు దగ్గరికి వెలితే మందు బాబులకు చేదు అనుభవం ఎదురవుతున్నది. వేసవి కాలం ఎండ తాకిడికి చల్లని బీరు వేసి ఒక కునుకు తీద్దామంటే వైన్ షాపు ల యజమానులు తమకు ఇష్టమైన కింగ్ ఫిషర్ బీరుని బెల్టు షాపులకి అమ్మి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మందు బాబులు ఆరోపిస్తున్నారు. దీంతో చేసేది లేక బీరు ప్రియులు ఉసురుమంటున్నారు. ఇష్టం లేకున్నా ఇతర బీర్లు కొని సేద తీరుతున్నారు. పసలేని పనికి మాలిన బీర్లు అమ్ముతు రెండు రకాలుగా వైన్ షాపుల యజమానులు కాసులు సంపాదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు 60 నుండి 70 శాతం అమ్ముడు పోతున్నట్టు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బెల్టు షాపుల్లో రూ.180 ఉన్న లైట్ బీరు రూ. 200 నుండి రూ.210 వరకు అమ్ముతున్నారు. ఆంటే ఒక బీరు నుండి రూ.20 నుండి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వైన్ షాపుల్లో కొంత మంది బీర్ల ప్రియులు ఎందుకు స్టాక్ లేదని ప్రశ్నిస్తే కొంత మంది అమ్మకం దారులు స్టాక్ రావడం లేదని, మరికొంత అమ్మకం దారులు కొంటె కొనండి లేదంటే ఊరుకొండని దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మరికొంత మంది అయితే గొడవలకు కూడ దిగుతున్నారంటే వైన్ షాపుల యజమానులు వినియోగదారుల పై ఎంత దురుసు తనం పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని వైన్ షాపుల్లో అయితే వాటర్ బాటిల్లు నాసిరకం వి అమ్ముతున్నారు. వాటర్ ప్యాకెట్లు ఆయితే మరి గోరంగా ఎక్స్పైరి డేట్ లేకుండా అమ్ముతున్నారు. ప్రతి రోజు కూలి నాలి చేసే పేదలు ఒక 90 ఎమ్ ఎల్ మందు కొని ఒక వాటర్ ప్యాకెట్ కొని కలుపుకొని తాగుతారు. ఈ కల్తీ వాటర్ వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొంటున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఈ కల్తీ నీరు, కల్తీ మందుల వల్ల, కొత్త కొత్త రకం బీర్లు తాగడం వల్ల ప్రజల లివర్ పాడయి పచ్చ కామర్ల రోగాల బారిన పడి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్న ఆబ్కారీ అధికారులు మాత్రం ఆఫీస్ ను అంటి పెట్టుకొని వేసవి తాపం తీర్చుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక మందు ప్రియులకు కింగ్ ఫిషర్ బీర్లను అందుబాటులో ఉంచాలని బీర్ల ప్రియులు కోరుతున్నారు.
ఆబ్కారీ సిఐ వివరణ: నర్సాపూర్ పట్టణంలో లొ కింగ్ ఫిషర్ బీర్ల కృతిమ కొరత పై క్రైమ్ మిర్రర్ ప్రతినిధి ఆబ్కారీ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించగా సిఐ అందుబాటులో లేరు.