
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసీం మునీర్ పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. అసిం మునీర్ పాకిస్తాన్ చరిత్రలోనే పెద్ద నియంత అని మండిపడ్డారు. అధికారం కోసం అతను ఎంతకైనా తెగిస్తాడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అతని మానసిక స్థితి కూడా సరిగా లేదు అని వెల్లడించారు. అధికారంలో ఉన్నాడు అని చెప్పి.. నా భార్య బుష్రా బీబీ ని ఒంటరిగా ఉంచి మరి మానసికంగా హింసిస్తున్నాడు అని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. బానిసత్వం కంటే మేము చావునే కోరుకుంటామని.. ఎప్పటికైనా వీళ్ళ ముందు తలవంచే పరిస్థితి లేదు అని వెల్లడించారు. 2023 ఆగస్టు నెల నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉండి మగ్గిపోతున్నారు. మమ్మల్ని మేము ఎక్కడ కూడా సరెండర్ చేయము అని తెలిపారు. ఇక ఈ అసీం మునీర్ మన భారతదేశంపై కూడా ఇప్పటివరకు ఎన్నో అవమానకర వ్యాఖ్యలు, ఎన్నో ఇబ్బందికర సన్నివేశాలను కూడా సృష్టించాడు. ఆర్మీ చీఫ్ఆ పై ఆ దేశస్థులతో పాటు భారతీయులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
Read also : KCR ను జైల్లో వేస్తామని మీకు చెప్పామా.. రేవంత్ కు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి!
Read also : జూబ్లీహిల్స్ లో ఓడిపోతామన్న భయం లో రేవంత్ ఉన్నాడు : కేటీఆర్





