ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి హామీ ఇచ్చారు. ఇక సంక్రాంతి పండుగ కానుకగా ఆ రోజుటి నుంచే ఈ పథకం అమలు చేయనున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న బాలీవుడ్ నటుడు!..
ఇప్పటికే ఈ సేవలను సులభతరం చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న ఆయన చెప్పుకొచ్చారు. ఈ పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో అదనపు బస్సులను కూడా కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఆర్టీసీ ఉన్నత అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ప్రతిపాదనలు పంపారని వాటికి ఆమోదం కూడా పొందారని చెప్పుకొచ్చారు.
ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్?
అలాగే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లకు కొంచెం ఆర్థికంగా నష్టం కలుగుతుందని భావనతో ఎవరికి కూడా ఇటువంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందిస్తుంది. ఇక వీటికి సంబంధించి అనుగుణంగా సంబంధిత మార్గదర్శకాలు ను రూపొందిస్తున్నామని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. అయితే మొదటగా ఆగస్టు 15న ఈ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని తెలుపుగా కొన్ని అనువార్య కారణాలవల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనున్నారు.