
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది మందుబాబులు తాగేసి రోడ్లు మీద తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వానికి కూడా మద్యం ద్వారా చాలానే ఆదాయం వస్తూ ఉండడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరి కొత్త విధానంతో ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ కొత్త బార్ పాలసీని ప్రకటించడం జరిగింది. ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమై దాదాపు మూడు సంవత్సరాల అంటే ఆగస్టు 31,2028 వరకు కూడా కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక మొత్తం 840 బార్లకు టెండర్లు వేసి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తారు. ఒక్క బార్ కు కనీసం 4 అప్లికేషన్స్ వస్తేనే లాటరీ తీస్తామని ప్రభుత్వం కీలక ఇన్ఫర్మేషన్ చెప్పుకొచ్చింది.
Read also : ఒక వైపు భారీ వర్షాలు.. మరోవైపు భూప్రకంపనలు!.. ప్రజల్లో టెన్షన్, టెన్షన్
ఇక్కడ ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు.. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నిర్ణయించింది. ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు 5 లక్షల రూపాయలు, అదనంగా పదివేల రూపాయలను చెల్లించాలని తెలిపింది. ఇక ఆయా షాపులకు సంబంధించి లైసెన్స్ ఫీజులు జనాభా ఆధారంగా నిర్ణయిస్తారు. 50వేల కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు 35 లక్షలు, 50,000 నుంచి 5 లక్షలు జనాభా ఉన్న ప్రాంతాలకు 55 లక్షలు, ఐదు లక్షల పైగా ఉన్న జనాభా ఉన్న ప్రాంతాలకు 75 లక్షలు ఉంటుంది అని తెలిపింది. ఈ కొత్త బార్ పాలసీ ద్వారా ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా బార్లకు అనుమతి ఉంటుంది అని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఒకే ఒక్క 99 రూపాయల మద్యం మినహా అన్ని బ్రాండ్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే చాలామంది మద్యం తాగే వాళ్లకు ఇది ఒక విధంగా శుభవార్త అయినా కూడా… మహిళల నుండి ఈ పాలసి పై విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది.
Read also : లైన్ మెన్ సాహసం.. అభినందించిన డిప్యూటీ సీఎం!